సలార్ సినిమా షారుఖ్ డంకీ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వడంతో హిందీ వర్గాలు ఒక్కసారిగా సౌత్ సినిమాలని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. సలార్ సినిమా బుకింగ్స్ ఫేక్ అని, కలెక్షన్స్ అన్నీ కార్పొరేట్ అని షారుఖ్ ఖాన్ ఫాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చేసారు. సింగల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కబ్జా చేసి ప్రభాస్ సినిమాకి అందకుండా చేయడంలో షారుఖ్ అండ్ టీమ్ చాలా పెద్ద స్కెచే వేశారు. లక్కీగా డంకీ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించి హిట్ అవ్వలేదు కానీ ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే సలార్ సినిమాకి సింగల్ స్రీన్ కూడా దొరికేది కాదు. లాస్ట్ కి సలార్ హిట్ అవ్వడం, డంకీ థియేటర్స్ సలార్ కి షిఫ్ట్ అవ్వడం, సలార్ సినిమా హిందీలో వంద కోట్లు కొట్టడం అంతా అలా జరిగిపోయాయి. అయితే ఇప్పటికీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సలార్ కలెక్షన్స్ ఫేక్ అనే కామెంట్స్ చేస్తూ ఉంటారు.
సలార్ కి థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన బాలీవుడ్ ఇప్పుడు పుష్ప 2 విషయంలో ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయ్యే రోజునే హిందీలో మోస్ట్ సక్సస్ ఫుల్ ఫ్రాంచైజ్ సింగం నుంచి సింగం 3 సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15నే రిలీజ్ డేట్ లు లాక్ చేసుకొని ఉన్నాయి. పుష్ప 2 ముందు సింగం 3 నిలబడలేదు, వాయిదా పడుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఒకవేళ సింగం వెనక్కి తగ్గకపోతే మాత్రం పుష్ప 2కి థియేటర్స్ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ప్రయతించే అవకాశం ఉంది. అయితే పుష్ప మేనియా వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి పుష్పరాజ్ గాడి ముందు సింగం 3 సినిమా అసలు కనిపించే అవకాశం, వినిపించే అవకాశం లేదు కాబట్టి ఏ విషయంలో కూడా పుష్ప 2 ఇబ్బంది పడకుండానే రిలీజ్ అవనుంది.