Pushpa 2 The Rule Dialogue Leak Goes Viral: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు హిందీలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక మొదటి భాగం సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈసారి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కలిసి సుకుమార్ కూడా సినిమా మీద పెట్టుబడి పెట్టి మరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఇండియా వైడ్ గా అన్ని భాషల ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా అల్లు అర్జున్ ఒక డైలాగ్ లీక్ చేశారు.
Allu Arjun: కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానినే..
అసలు విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ లీక్ చేశారు అల్లు అర్జున్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన బేబీ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ పుష్ప 2 సినిమా డైలాగ్ లీక్ చేశారు. ‘’ఇదంతా జరిగేది ఒకటే రూల్, ఆ రూల్ మీదే అంతా జరుగుతుండాది’’ అంటూ అల్లు అర్జున్ చిత్తూరు యాసలో చెబుతున్న డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించగా ఫహద్ ఫాలో ఒక కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇక పుష్ప రెండో భాగంలో అనేకమంది నటీనటులు కూడా భాగమవుతున్నారు అని ప్రచారం జరుగుతున్నా ఆ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు.