Pushpa 2: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల వెల్లువ కురిసింది. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్.. సీనియర్, జూనియర్ హీరోలందరితో అమ్మడు జతకట్టింది. అందులో కొన్ని హిట్లు అందుకోగా .. ఎక్కువ పరాజయాలనే అందుకుంది. అయినా కూడా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీలీల అంటే డ్యాన్స్.. డ్యాన్స్ అంటే శ్రీలీల అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక మహేష్ బాబు అయితే.. ఈ చిన్నదానికి లేడీ ప్రభుదేవా అని పేరుకూడా పెట్టేశాడు. అంతలా డ్యాన్స్ తో అదరగొడుతుంది. స్టార్ హీరోలు సైతం అమ్మడితో డ్యాన్స్ చేయాలంటే భయపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే శ్రీలీల గత ఏడాది సినిమాలు చూసుకుంటే.. అన్ని పరాజయాలే. స్కంద,ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ పరాజయాలే.. గుంటూరు కారం హిట్ అయినా.. అది కేవలం మహేష్ బాబు వలనే అనేది టాక్. అది శ్రీలీలకు క్రెడిట్ దక్కదు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలు అన్నింటిలో శ్రీలీల డ్యాన్స్ కు తప్ప వేరే ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. దీంతో శ్రీలీల డ్యాన్స్ కు మాత్రమే పనికి వస్తుందని చెప్పుకొస్తున్నారు.
ఇక తాజాగా పుష్ప 2 కోసం శ్రీలీల రంగంలోకి దిగిందని వార్తలు వస్తున్నాయి. అమ్మడి డ్యాన్స్ కు ఫిదా అయిన మేకర్స్.. పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పలో సమంత ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. సెకండ్ పార్ట్ లో కూడా ఆమెనే తీసుకుందామనుకున్నారట. కానీ, సామ్ అందుకు సుముఖంగా లేదని ఆపేసారని టాక్. ఇక బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా ఐటెం సాంగ్ కు రెడీగా ఉన్నా కూడా .. తెలుగులో చాలా సినిమాలు చేసి ఉండడంతో అభిమానులు బోర్ ఫీల్ అవుతారని ఆపేశారట.. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ శ్రీలీల మీదనే ఉంది. బన్నీ.. ఎలాంటి డ్యాన్సర్ అనేది అందరికి తెలుసు.. అతనికి శ్రీలీల కూడా తోడైతే.. సాంగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.