Pushpa 2: జాలిరెడ్డి ఈసారి అంతకు మించి చూపిస్తాడట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 త్వరలోనే రానుంది. పుష్ప 2 తో ఈసారి బన్నీ గ్లోబల్ స్టార్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప లో నటించిన విలన్స్.. వేరే భాషల్లో స్టార్ హీరోస్ అని అందరికి తెల్సిందే. షెకావత్ గా నటించింది మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కాగా .. జాలిరెడ్డిగా నటించింది కన్నడ హీరో ధనుంజయ. కథ, పాత్ర నచ్చడంతో మారు మాట్లాడకుండా వీరు ఈ సినిమాలో నటించారు.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఇక పుష్ప 2 లో కూడా వీరి పాత్రలను సుకుమార్ ఓ రేంజ్ లో మలుస్తున్నాడు. ఇప్పటికే ఫహద్ పుట్టినరోజున ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన మేకర్స్ తాజాగా నేడు ధనుంజయ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ” ట్యాలెంటెడ్ నటుడు ధనుంజయ కు పుష్ప 2 టీమ్ బర్త్ పే విషెస్ తెలుపుతుంది.. ఈసారి స్కోర్లను పరిష్కరించేందుకు జాలీ రెడ్డి తిరిగి రానున్నారు” అని చెప్పుకొచ్చింది. అయితే జాలిరెడ్డి నార్మల్ ఫోటోను మాత్రమే షేర్ చేయడంతో పుష్ప 2 లోని పోస్టర్ ను షేర్ చేయొచ్చుగా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక పుష్ప లో జాలిరెడ్డి పాత్ర గుర్తుంది గా.. కనిపించిన అమ్మాయిని సొంతం చేసుకుంటూ ఉంటాడు. చివరికి పుష్పగాని లవర్ శ్రీవల్లి మీద చేయి వేయడంతో.. జాలిరెడ్డిని పుష్ప చితకబాదుతాడు. ఇక పార్ట్ 2 లో పుష్పను చంపడానికి జాలిరెడ్డి ఓ రేంజ్ లో స్కెచ్ లు వేసాడట.. మరి ఈసారి ఏ రరేంజ్ లో విలనిజాన్ని చూపిస్తాడో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!