Slum Dog Husband: ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ కామెడీ మూవీ చూసి నవ్వుకోవాలనుకుంటున్నారా? ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సప్తగిరి తమ పాత్రలతో నవ్వించారు. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ ఈ సినిమాతో కథానాయికగా పరిచమయ్యింది. పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ రావ్ ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ చిత్రాన్ని తీశాడు. అయితే ఈ సినిమా థియేటర్ల వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఆద్యంతం నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. అయితే ఎంత మంచి కాన్సెప్ట్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంతో అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులకు దగ్గరకాలేకపోయింది. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ దాదాపు అర్థం అయిపోయింది. దాంతో థియేటర్ కు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడలేదు. అయితే కామెడీ సినిమా కాబట్టి చాలా మంది ఓటీటీలో చూసే అవకాశం ఉంది.
Also Read: Sreeleela: అభిమానులకు షాక్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ఇక సినిమా కథ విషయానికి వస్తే జాతకంలో దోషం ఉండటం వల్ల ఒక యువకుడికి కుక్కతో ఘనంగా పెళ్లి చేస్తారు. అయితే ఆ యువకుడు తరువాత తన ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎదురైన సమస్యలు ఏంటి అనే కథతో ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం మంచి కామెడీగా సాగుతుంది. ఈ సినిమాను థియేటర్ లో చూడటం మిస్ అయితే మీరు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. రేపటి నుంచి అంటే ఆగస్టు 24 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సినిమా హీరోయిన్ ప్రణవి మానుకొండ కూడా ఓటీటీ అప్డేట్ ను స్వయంగా తెలిపింది. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసి హ్యాపీగా నవ్వుకోండి. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సినిరిలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?