Mahesh Babu’s Guntur Kaaram tops with 9.23 TRP in Gemini TV: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా మొన్న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే సినిమా యూనిట్ మాత్రం తమకు ఈ సినిమాలో డబ్బులు గట్టిగానే వచ్చాయని, ఈ సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ వచ్చింది. కానీ సినిమా చూసిన వాళ్ళు మాత్రం పెదవి విరిచిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ మధ్యనే ఈ సినిమాని టీవీలో ప్రసారం చేశారు. ఈ టీవీ ప్రసారం చేసిన సమయంలో ఆసక్తికరమైన టిఆర్పి నమోదయింది. ఈ మధ్యనే ఈ సినిమా జెమినీ టీవీలో ప్రసారం చేశారు. ఈ క్రమంలో 9.23 టీఆర్పీ గుంటూరు కారం సినిమా నమోదు చేసింది.
Aishwarya Rajesh: సరికొత్త పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న ఐశ్వర్య రాజేష్
మహేష్ బాబు సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ టీఆర్పీ అయినా సరే జెమినీ టీవీలో ఈ మధ్యకాలంలో ప్రసారమైన సినిమాల టిఆర్పి రేటింగ్స్ తో పోలిస్తే ఇది ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే వాల్తేరు వీరయ్య సినిమాకి 5.14, హాయ్ నాన్న సినిమాకి 4.45, దసరా సినిమాకి 4.99, గాడ్ ఫాదర్ సినిమాకి 7.69, హిట్ 2 సినిమాకి 3.69, జైలర్ సినిమాకి 6.30, లియో సినిమాకి 3.00, సార్ మూవీకి 5.89 టీఆర్పీ నమోదయ్యాయి. నిజానికి గుంటూరు కారం సినిమాతో పోలిస్తే పైన చెప్పిన సినిమాలన్నీ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలే. కానీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని కూడా 9.23 టిఆర్పి రేటింగ్ సాధించడం కేవలం మహేష్ వల్లనే సాధ్యమైంది. ఈ ఆ విషయంలో ఆయన తోపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.