డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ రిపీట్ ఆడియన్స్ ని రాబట్టింది. అప్పటివరకూ చాక్లెట్ బాయ్ గా కనిపించిన రాం పోతినేని, పూర్తిగా పూరి మార్క్ హీరోగా మారిపోయి సిక్స్ ప్యాక్ చేసి మాస్ లుక్ లోకి వచ్చేసాడు. పూరి జగన్నాథ్ కాకుండా వేరే ఎవరు డైరెక్ట్ చేసినా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక పాపర్ సైంటిఫిక్ థ్రిల్లర్ అయ్యేది, పూరి చేశాడు కాబట్టే మెడికల్ పాయింట్ ఉన్నా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా కల్ట్ మాస్ సినిమా అయ్యింది.
16 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఓవరాల్ గా 80 కోట్ల వరకూ రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది. పూరి మార్క్ డైలాగ్స్, రామ్ పోతినేని షాకింగ్ మేకోవర్, హీరోయిన్స్ గ్లామర్, మణిశర్మ దుమ్ము లేపే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాని ఒక రేంజులో నిలబెట్టాయి. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ కోసం రామ్ పోతినేని ఫాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ ఎండింగ్ లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ ఉంటుంది అని మేకర్స్ హింట్ ఇవ్వడంతో పూరి-రామ పోతినేని ఎప్పుడు సినిమా చేస్తారా అని మాస్ ఆడియన్స్ అంతా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఎండ్ కార్డ్ పడింది. మే 15న రామ్ పోతినేని పుట్టిన రోజున కావడంతో, ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా గురించి పూరి కనెక్ట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 8న డబుల్ ఇస్మార్ట్ థియేటర్ లోకి వస్తుంది అని పూరి తన స్టైల్ లో అనౌన్స్మెంట్ తోనే రిలీజ్ డేట్ కూడా చెప్పేశాడు.
ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ పూరి కనెక్ట్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఇస్మార్ట్ శంకర్ సినిమా క్లైమాక్స్ లో రామ్ పోతినేని పట్టుకున్న త్రిశూలం ఉంది. సో అక్కడి నుంచే ఈ కథ కంటిన్యు అయ్యేలా ఉంది. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెలుగుకి మాత్రమే పరిమితం చేసిన పూరి జగన్నాథ్, ‘డబుల్ ఇస్మార్ట్’ని పాన్ ఇండియా రేంజుకి తీసుకోని వెళ్లాడు. రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్ లో సెట్స్ పై ఉన్న సినిమా షూటింగ్ అయిపోగానే డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ అవ్వనుంది. మరి పూరి-రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టీరియా రిపీట్ చేస్తారేమో చూడాలి.
The ENERGETIC combo of
Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh is back with ISMART BANG for #DoubleISMART🔥A high octane action entertainer in cinemas from MARCH 8th 2024💥
In Telugu, Hindi, Tamil, Malayalam, Kannada#HappyBirthdayRAPO@Charmmeofficial pic.twitter.com/zVq6AX6rH3
— Puri Connects (@PuriConnects) May 14, 2023