దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా ఆసక్తికరమైన కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. వాటిలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబో ఫ్యాన్స్‌కి బాగా హైప్‌ని ఇస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మంచి వేగంతో సాగుతూ, చాలా సన్నివేశాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఇంత కాలం ఎదురుచూస్తున్న ఈ కలయిక, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. ఇటీవల మేకర్స్ ఈ సినిమా కోసం ఓ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు, అది ఫ్యాన్స్‌లో పెద్ద ఉత్కంఠను సృష్టించింది.
Also Read : Ram Charan: ‘పెద్ది’ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ – చరణ్, జాన్వీపై మ్యూజిక్ మ్యాజిక్!
మేకర్స్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ‘యానిమల్’ చిత్రానికి అందించిన సంగీతం కారణంగా ఇటీవల జాతీయ అవార్డు కూడా గెలిచిన ఈ యువ సంగీత దర్శకుడు, పూరి జగన్నాథ్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ టచ్, ఫ్రీక్వెన్సీ ఇస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ముందే ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు, థ్రిల్లింగ్ మ్యూజిక్ కోసం క్రేజీగా ఎగురుతున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రస్తుతం టాలీవుడ్ లో పూర్తిగా ఫుల్ బిజీగా అయ్యాడు. దీంతో పాటుగా త్రివిక్రమ్–వెంకీ మామ ప్రాజెక్ట్, ‘స్పిరిట్’ వంటి ఇతర సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు.