రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి పుణెలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు.
Also Read : Prabhas-Vijay : కరూర్ ఘటన ప్రభావం.. విజయ్ మూవీ వాయిదా? ప్రభాస్ ‘రాజా సాబ్’కు లైన్ క్లియర్ అవుతుందా?
ఈ కొత్త పాట కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన గీతాన్ని సిద్ధం చేశారు. కాగా ఈ పాట జానీ మాస్టార్ కోరిగ్రాఫి చేస్తుండగా, భారీ విజువల్స్‌తో ప్రేక్షకులకు మ్యూజిక్ మ్యాజిక్ అందించేలా దర్శక, సాంకేతిక బృందం సన్నాహాలు చేస్తున్నారట. నిర్మాణానంతర పనులు కూడా జాగ్రత్తగా జరుగుతున్నాయి, అంచనాల ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలనే లక్ష్యం పెట్టుకున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ఇక ఇతర ముఖ్య నటీనటులు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఆర్.రత్నవేలు ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. మొత్తనికి ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులకు మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, విజువల్స్ ద్వారా ఎంటర్‌టైనింగ్‌కి రంగి సిద్ధం చేస్తుంది.