Puri Jagananth: ఒక సినిమా హిట్ అయితే హీరోకు పేరు రావడం..ప్లాప్ అయితే డైరెక్టర్ పేరు పోవడం ఇండస్ట్రీలో సాధారణం. ఇక ఈ మధ్యనే లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఇక దీనికి తోడు ఈ సినిమాలో విదేశీ పెట్టుబడులు ఉన్నాయని ఆరోపణలు, ఇంకోపక్క తమకు నష్టపరిహారం చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్ల గొడవ.. ఇవన్నీ పూరిని కుంగదీశాయనే చెప్పాలి. అయితే పూరి అందరిలాంటి వాడు కాదు.. బంతిలా బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఇక తన పూరి మ్యూజింగ్స్ తో అభిమానుల్లో దైర్యం నింపుతున్న ఈ డైరెక్టర్ తాజాగా పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ” జీవితంలో చాలా జరుగుతాయి.. అవన్నీ మన కంట్రోల్ ల్కొ ఉండవు.. మన చేతిలో ఉన్నది ఒక్కటే.. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నాం.. పరిస్థితి ఏదైనా మన రియాక్షన్ కామ్ గా ఉండాలి.. అరిచి గోల చేయడం, తలను గోడకేసి కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఒక ఘటనకు ఎలా రియాక్ట్ అవుతున్నాం.. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే ఎలా ఆన్సర్ ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. బ్యాలెన్సుడ్ గా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడం నేర్చుకోవాలి.. ఏది మాట్లాడిన మన ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి.
ఇక ఇడియట్ మూవీలో రక్షితకు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది.. ఆమె ఒక సీన్ లో ఏడ్వాలి.. కానీ రక్షిత నవ్వుతోంది.. నాకు బాగా కోపం వచ్చింది.. సెట్ లో అందరి ముందు రక్షితపై కోప్పడ్డాను.. నువ్వు ఇలా చేస్తే నెక్స్ట్ సినిమాలో నీకు పాత్ర రాయను అని చెప్పేశాను. అందుకు ఆమె వెంటనే.. రాయాలి.. రాయకపోతే చంపేస్తా .. నీ తరువాత పది సినిమాలు నేనే చేస్తా.. ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పి చావు అని అంది.. నేను వెంటనే షాక్ అయ్యి.. నవ్వుకున్నాను. ఆమె మీద కోపక్మ్ మొత్తం పోయింది. ఆ సమయంలో ఆమె నేను అన్న మాటలను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి సెట్ నుంచి వెళ్లిపోవచ్చు.. అలిగి రెండు రోజులు సెట్ కు రాకపోవచ్చు.. కానీ ఆమె ఆలా చేయలేదు.. ఇక సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ పెడితే.. దాని గురించి ఆలోచిస్తూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిస్తే చాలు.. సమస్య ఏదైనా నవ్వుతు బదులు చెప్పండి.. లేకపోతే చిరునవ్వు నవ్వి వదిలేయండి. నవ్వుతోనే చాలా సమస్యలను పరిష్కరించవచ్చు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.