Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న మూవీ రాజాసాబ్. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఓ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. పైగా ఇందులో ఆయన లుక్స్ వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ సందడి చేశారు. పూరీని ప్రభాస్ ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : Kingdom : లక్ష టికెట్లు సేల్.. కింగ్ డమ్ హవా..
రాజాసాబ్ మూవీ షూటింగ్ గురించి వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా గత విశేషాలను కూడా పంచుకున్నారు. సెట్స్ లో ప్రభాస్ లుక్స్ ఈ ఫొటోల్లో అదిరిపోయాయి. ప్రభాస్ ఇందులో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలు చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ లో యంగ్ ఏజ్ ప్రభాస్ ను చూపించారు గానీ.. ఓల్డేజ్ ప్రభాస్ ను చూపించలేదు. సినిమాలో ఓల్డేజ్ లుక్ కీలకం కాబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Kingdom : విజయ్ కు మంచి ఛాన్స్.. హిట్ కొడితే వసూళ్ల వర్షమే..