Kingdom : విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత మంచి ఛాన్స్ దొరికింది. పైగా ఈ సారి తన వెనక మంచి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ దొరికింది. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ కాబోతోంది. ఎలాంటి పోటీ ఉండొద్దని రెండు సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. వారం కిందట భారీ అంచనాలతో హరిహర వీరమల్లు.. ఇప్పుడు చల్లబడ్డాడు. వీరమల్లుపై మిక్స్ డ్ టాక్ ఉండటంతో ఆ మూవీకి ఆదరణ తగ్గుతోంది. పైగా పదిహేను రోజుల దాకా పెద్ద సినిమాలు లేవు. కింగ్ డమ్ మీద ట్రైలర్ తో భారీగా అంచనాలు పెరిగాయి. టికెట్ రేట్లు కూడా కొంత వరకు ఏపీలో పెంచారు.
Read Also : Rajamouli : క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు రాజమౌళి స్పెషల్ గిఫ్ట్..
కాబట్టి రేట్ల విషయంలో పెద్దగా నెగెటివిటీ లేదు. సితార సంస్థకు బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది. అనిరుధ్ వల్ల తమిళ్ లో మార్కెట్ ఏర్పడింది. పైగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ వల్ల మూవీపై పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. ఇలా అన్ని రకాలుగా కింగ్ డమ్ కు మంచి వాతావరణం ఏర్పడింది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా వసూళ్లు భారీగా పెరుగుతాయి. అందులో నో డౌట్. పైగా గురువారం రిలీజ్ అవుతోంది కాబట్టి లాంగ్ వీకెండ్ దొరికింది. ప్రస్తుతం థియేటర్లలో వీరమల్లు, మహావతార్ ఆడుతున్నాయి. వీరమల్లు జోరు తగ్గింది. మహావతార్ ఉన్నా మాస్ ఆడియెన్స్ కింగ్ డమ్ వైపే చూస్తున్నారు. కాబట్టి కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్నా విజయ్ కెరీర్ కు ఇది బూస్ట్ అవుతుంది.
Read Also : Kingdom : అతన్ని నాతోనే ఉంచుకోవాలని ఉంది.. విజయ్ కామెంట్స్