కన్నడ సూపర్ స్టార్స్ లో ‘దర్శన్’ ఒకరు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే దర్శన్ లేటెస్ట్ మూవీ ‘క్రాంతి’. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శన్ ‘హోస్పేట్’ వెళ్లాడు. ఇక్కడ ఫాన్స్ మధ్యలో దర్శన్ స్పీచ్ ఇస్తూ ఉండగా, ఎవరో అతనిపై చెప్పు విసిరేసారు, అది దర్శన్ భుజానికి తగిలింది. ‘క్రాంతి’ సినిమా పోస్టర్స్ ని, ఫ్లెక్స్ లనీ కూడా చించేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఫాన్స్ హల్చల్ చేశారు. తమ దివంగత హీరో గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ పునీత్ రాజ్ కుమార్ ఫాన్స్ దర్శన్ పై చెప్పు విసిరేయడంతో అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు, అల్లరి చేస్తున్న వాళ్లకి అరెస్ట్ చేశారు.
దర్శన్ పై జరిగిన దాడికి పునీత్ రాజ్ కుమార్ అన్న అయిన ‘శివ రాజ్ కుమార్’ స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాడి చేయడం తప్పు అంటూ శివ రాజ్ కుమార్ మాట్లాడారు. ఇదే విషయంపై కిచ్చా సుదీప్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ‘హీరోలకి, హీరోల అభిమానులకి మధ్య డిఫరెన్స్ లు ఉండడం మాములే కానీ ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి చర్యని పునీత్ కూడా ఒప్పుకోడు. అభిమానం పేరుతో ఇలాంటి పనులు చెయ్యొద్దు అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు. పునీత్, దర్శన్ ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్న సుదీప్… దర్శన్ కి మద్దతుగా సుదీప్ మూడు పేజీల్లో తన అభిప్రాయాన్ని చెప్పాడు సుదీప్. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఎదో ఒక రోజు పోవాల్సిన వాళ్లమే కాబట్టి కాస్త ప్రేమగా ఉందాం అంటూ కిచ్చా సుదీప్ పోస్ట్ చేశాడు. మరి ఇక్కడితో అయినా ఈ వివాదం ముగుస్తుందా? లేక ఇంకా పెరుగుతుందా అనేది చూడాలి.
Rebellion isn't always an Answer.
❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0— Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022