Pulsar Bike Jhansi Shares Her Bad Experience In Life: వంద మందిలో కేవలం ఒకరిద్దరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. మిగతా వాళ్లు మాత్రం.. తమ ప్రతిభతోనే ముందుకు నెట్టుకురావాల్సి ఉంటుంది. రేయింబవళ్లు కష్టపడి, తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. పోనీ.. ఈ ప్రయాణమైనా సజావుగా ఉంటుందా? అంటే అదీ లేదు. ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా.. అమ్మాయిలైతే నరకం చవిచూడాల్సి ఉంటుంది. అయితే.. ఈ నరకాన్ని దాటి ఎందరో తమ కలల్ని సాకారం చేసుకున్నారు. తాము కోరుకున్న డ్రీమ్‌ని నెరవేర్చుకున్నారు. అలాంటి వారిలో పల్సర్ బైక్ ఝాన్సీ ఒకరు. బస్ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. ఎన్నో పాటలకు స్టేజ్ పెర్ఫార్మెన్సులు ఇచ్చింది. అయితే.. పల్సర్ బైక్ పాట మాత్రం ఆమె కెరీర్‌ని మలుపు తిప్పేసింది. ఈ పాటకు స్టేజ్ దద్దరిల్లేలా డ్యాన్స్ చేయడంతో.. టీవీ షోలలో డ్యాన్స్ చేసే అవకాశాలు వస్తున్నాయి.
NBK108: బాలయ్య పాట చాలా కాస్ట్‌లీ గురూ!
ఈ క్రమంలోనే తాజాగా ఒక షోకి విచ్చేసిన ఝాన్సీ.. తన జీవితంలో తాను ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. జనాలు చెప్తున్నట్టు తానేమీ ఓవర్‌నైట్ స్టార్ కాలేదని.. దాని వెనుక 18 సంవత్సరాల కష్టం దాగి ఉందని భావోద్వేగానికి గురయ్యింది. ఒక విషయంలో తన తండ్రి కూడా తనకు మద్దతు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఝాన్సీ మాట్లాడుతూ.. ‘‘నేను ఓవర్‌నైట్ స్టార్‌ని అయ్యానని జనాలు అంటున్నారు. కానీ.. దాని వెనుక దాగి ఉన్న 18 సంవత్సరాల కష్టం వారికి తెలీదు. ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి, ఎన్నో కష్టనష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక రోజు బట్టల కోసం కొలతలు ఇవ్వడానికి టైలర్ షాప్‌కి వెళ్తే.. అందులో ఉన్న ఒక టైలర్ నా పట్ల తప్పుగా ప్రవర్తించాడు. అప్పుడు నాకు చాలా కోసం వచ్చింది. ఈ విషయం తండ్రికి చెప్పి, కొట్టిద్దామని అనుకున్నా. కానీ.. ఆయన నేను నీ తండ్రిని కాదని చెప్పమని అన్నాడు’’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది.
Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది