మాస్ మహారాజ్ రవితేజ ను స్టార్ హీరో రేంజ్ కు తీసుకెళ్లిన సినిమాల్లో అమ్మనాన్న తమిళ అమ్మాయి ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2003లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తల్లి సెంటిమెంట్ కు యాక్షన్ అంశాలను జోడించి పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అలాగే హీరోయిజం అభిమానులను ఎంతగానో మెప్పించాయి.అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తోనే రవితేజ స్టార్ హీరోగా మారాడు. అయితే అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయిలో హీరోగా మొదటి ఛాయిస్ రవితేజ కాదు. తమిళ నటుడు శ్రీరామ్ ఈ సినిమా లో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అఫీషియల్‌గా అతడితో ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశారట. కానీ ఫైట్స్‌తో కూడిన మాస్ క్యారెక్టర్‌కు న్యాయం చేయలేననే ఆలోచన లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాను శ్రీరామ్ వదులుకున్నాడు.
శ్రీరామ్ తిరస్కరించడంతో అతడి స్థానంలో పవన్ కల్యాణ్ ను తీసుకోవాలని పూరి జగన్నాథ్ అనుకున్నాడటా.కానీ పవన్ కూడా వర్కవుట్ కాకపోవడంతో రవితేజ ను హీరో గా సెలెక్ట్ చేశారు. అలా తమిళ హీరో శ్రీరామ్, పవన్ కల్యాణ్ చేయాల్సిన ఆ సినిమాను రవితేజకు కెరీర్ కు ఎంతగానో ఉపయోగ పడింది.రవితేజ కెరీర్‌ను ఈ సినిమా మలుపుతిప్పింది. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా వదులుకున్న విషయాన్ని శ్రీరామ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తో పాటు మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్ని తాను చేయలేకపోయానని తెలిపారు.అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ సరసన అసిన్ హీరోయిన్ గా నటించగా జయసుధ మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులకు ఎంతో ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు.