Producer SKN gifted a Benz car to Cult Blockbuster “Baby” director Sai Rajesh: ఈ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబీ మూవీ. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల నుంచి కూడా అనేక ప్రశంశలు అందుకుంది బేబీ సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేష్ ఆ వర్గం వారిని విపరీతంగా ఆకట్టుకున్నారు. సుమారు ఐదుకోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 90 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేష్ కు బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్.
Hitler : చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోనీ.. ‘’హిట్లర్’’ అంటూ వచ్చేస్తున్నాడు!
నిజానికి బేబీ సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేష్ కు ఒక ఎంజీ కంపెనీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్…బేబి సక్సెస్ సంతోషంలో బెంజ్ కారు బహుమతిగా అందించారు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. బేబీ మూవీ సక్సెస్ వాళ్ల స్నేహానికి, ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకానికి, సినిమా మేకింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కు తగిన సక్సెస్ అందించిందని చెప్పొచ్చు. థియేటర్ లో సూపర్ హిట్ అయిన బేబీ మూవీ ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుందని మేకర్స్ అంటున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంట. సాయి రాజేష్ తన నెక్స్ట్ సినిమా కూడా ఎస్ .కే.ఎన్ తోనే చేస్తున్నారు, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఎంజీ హెక్టారు కారు ధర 22 లక్షలు కాగా ఇప్పుడు ప్రెజెంట్ చేసిన బెంజ్ కారు ధర 45 లక్షల పైమాటే.