Producer Dil Raju Speech At Thank You Pre Release Event: థాంక్యూ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. ఈ సందర్భంగా ఓ సీక్రెట్ లీక్ చేసేశారు. ప్రసంగించడానికి వేదికపై వచ్చినప్పుడు.. ఫ్యాన్స్ అందరూ ఓ మాస్ సినిమా చేయాల్సిందిగా దిల్ రాజుని కోరుతూ గట్టిగా కేకలు వేశారు. అప్పుడు దిల్‌రాజు వెంటనే అందుకొని.. ఆల్రెడీ చైతూతో సినిమా ప్రకటించడం జరిగిందని, మాస్ సినిమా తీసేందుకే వర్కౌట్స్ జరుగుతున్నాయని చెప్పేశాడు. దీంతో.. ప్రాంగణంలో ఉన్న అభిమానులందరూ సంతోషంగా ఉర్రూతలూగిపోయారు. థాంక్యూ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.
ఇదే సమయంలో RC15 సినిమాతో 50 సినిమాల మైలురాయిని అందుకున్న తరుణంలో.. దిల్ సినిమా నుంచి RC15 దాకా తాను కలిసి పని చేసిన హీరోలు సహా దర్శకులకు థాంక్యూ చెప్పారు. ఈ క్రమంలో అతడు బన్నీ, తారక్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య తదితర హీరోల పేర్లు తీసుకోవడంతో.. ప్రాంగణం అంతా హోరెత్తింది. అలాగే, తన దివంగత భార్యని గుర్తు చేస్తూ.. తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న ఆమెకూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక తాను 51 ఏళ్ల వయసులోనూ ఇంత యంగ్‌గా ఉండటానికి కారణం నాగార్జున అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ఇలా యాక్టివ్‌గా ఉన్నానంటూ దిల్ రాజు చెప్పడం గమనార్హం.
ఈ సినిమా కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నామని, జులై 22వ తేదీన రాబోతున్న ఈ చిత్రం కచ్ఛితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని దిల్ రాజు పేర్కొన్నారు. అలాగే.. సరసనమైన ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయని, టికెట్ రేట్లు ఏమాత్రం పెంచట్లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. థియేటర్లలోనే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో, ఇన్నాళ్లూ వేచి చూశామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.