కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు రేస్ లోకి వచ్చారు. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఇదే సీజన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ‘వారిసు’ సినిమా ‘వారసుడు’గా తెలుగులో విడుదల కానుంది. దిల్ రాజు ఫ్రేమ్ లోకి రాగానే, చిరు బాలయ్యలకి థియేటర్స్ తగ్గుతాయి అనే చర్చ మొదలయ్యింది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇస్తారు అనే విషయం పక్కన పెడితే, రిలీజ్ కి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రం ఉంది కానీ మన స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్ లో జోష్ కనిపించట్లేదు.
ఇప్పటివరకూ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ నుంచి బయటకి వచ్చింది ఒక్క పాట మాత్రమే. సెకండ్ సాంగ్ గురించి అనౌన్స్మెంట్ ఇంకా బయటకి రాలేదు కానీ బాలయ్య మాత్రం తాను జనవరి 12న ఆడియన్స్ ముందుకి వస్తాను అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. చిరు అండ్ టీం నుంచి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ అనౌన్స్ కావాల్సి ఉంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలు ప్రమోషన్స్ విషయంలో వెనకపడి ఉంటే, ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వగా రీసెంట్ గా ‘థీ దళపతి’ అంటూ అదిరిపోయే సాంగ్ ని రిల్రిలీజ్ చేశారు. ఈ సెకండ్ సాంగ్ ‘వారిసు’ ప్రమోషన్స్ కి ఎక్కడా లేనంత ఎనర్జీ తెచ్చింది. వారం రోజుల్లో మూడో పాట రిలీజ్ చేయడానికి కూడా ‘వారిసు’ చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇంత స్వింగ్ లో చేయడానికి కారణం ప్రొడ్యూసర్ దిల్ రాజు అని సమాచారం. సంక్రాంతి బరిలో సినిమా నిలబెట్టి, చిరు బాలయ్యలని కాదని ఆడియన్స్ ని ‘వారిసు’ థియేటర్స్ వైపు నడిపించాలి అంటే ఈ సినిమా జనాల్లోకి వెళ్లాలి. పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వాలి, అప్పుడే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ విషయం తెలిసిన వాడు కాబట్టే ‘వారిసు’ సినిమాని దిల్ రాజు అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు.