Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా థియేటర్ లో రిలీజ్ చేసి ఫ్యాన్స్ తో మహేశ్ బాబుకు చిట్ చాట్ పెట్టాలని అనుకున్నాం. కానీ ట్రైలర్ ముందే చూపిస్తే అందులోని కథ తెలిసిపోతుందని.. మహేశ్ బాబు మూవీకి ఓపెనింగ్స్ రావని ఒకరు చెప్పడంతో మేం ఆగిపోయాం.
Read Also : Terror Activity : ఏపీలో ఉగ్రకదలికలు.. భయం భయం..
ట్రైలర్ ను రిలీజ్ చేయకుండా నేరుగా సినిమాను రిలీజ్ చేశాం. థియేటర్లో సినిమా చూసిన వారికి మహేశ్ బాబుకు వ్యాధి ఉందని తెలిసి తట్టుకోలేకపోయారు. ఒకవేళ ముందే ట్రైలర్ లో మేం ఆ లోపం చూపించి ఉంటే ఫ్యాన్స్ సినిమా చూసే టైమ్ కు అలవాటు పడిపోయి ఉండేవారు. అప్పుడు మూవీపై పెద్దగా నెగెటివిటీ లేదు. ముందే ఆ విషయం తెలిస్తే ఇబ్బంది ఉండేది కాదు. మేం ఆ విషయం పొరపాటు చేశాం. దూకుడు సినిమాను మేమే నిర్మించాం. ఆ మూవీ కంటే వన్ నేనొక్కడినే పెద్ద హిట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ అలా కాలేదు. ట్రైలర్ లో కథ ముందే తెలిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ తెలిపారు అనిల్ సుంకర.
Read Also : Illegal Affair : అడ్డొస్తే రక్తపాతమే.. అక్రమ సంబంధాల నెత్తుటి కథలు..