హిందీతో పాటు మరాఠీలోనూ పలు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు రమేశ్ డియో (93) అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 1926 జనవరి 30వ తేదీ రమేశ్ డియో మహారాష్ట్ర లోని అమరావతిలో జన్మించారు. ఐదు దశబ్దాల కెరీర్ లో హిందీ, మరాఠీలో పలు చిత్రాలలో నటించారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
1962లో ‘ఆర్తీ’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రమేశ్ ‘ఆనంద్’, ‘మేరే అప్నే’, ‘ఆప్ కీ కసమ్’, డ్రీమ్ గర్ల్’, ‘జాలీ ఎల్.ఎల్.బి.’, ‘ఘాయల్ వన్స్ ఎగైన్’ తో పాటు దాదాపు 250 చిత్రాలలో నటించారు. ఇందులో కొన్ని మరాఠీ చిత్రాలూ ఉన్నాయి. అంతే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ ఆనంద్ డియో పలు చిత్రాలు రూపొందించారు. ఆయన భార్య సీమ కూడా నటి. వీరి కుమారుల్లో ఒకరైన అజింక్యా హిందీ, మరాఠీ చిత్రాలలో పేరున్న నటుడు. వీరి మరో కుమారుడు అభినయ్ ‘ఢిల్లీ బెల్లీ, ఫోర్స్ -2’ చిత్రాలను డైరెక్ట్ చేశాడు.