Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ ఆలోచింపజేస్తుందని డైరెక్టర్ కరుణ కుమార్ అన్నారు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తీయగా.. తాజాగా దీన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ.. నిజమైన ఘటనలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలను చూపించాలంటే డాక్యుమెంటరీలే అద్భుతంగా పనిచేస్తాయన్నారు. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుందన్నారు.
Read Also : SSMB 29 : రాముడిగా మహేశ్ బాబు.. జక్కన్న ఏంటి నీ ప్లాన్..
మహేష్ విట్టా మాట్లాడుతూ .. ‘‘ప్రొద్దుటూరు దసరా’ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. పది ఆలయాల్లో దసరా అద్భుతంగా జరుగుతుంది. దాన్నంతా ఇందులో బాగా చూపించారు. ప్రొద్దుటూర్లో దసరా అద్భుతంగా జరుగుతుందని ఈ డాక్యుమెంటరీ నిరూపించిందన్నారు. డైరెక్టర్ ఉదయ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో దసరాను ఇంత గొప్పగా ఎవరూ తీయలేదన్నారు. నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో దసరా ఎంత అద్భుతంగా జరుగుతుందో.. అక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయో ఇందులో చూపించామని.. ఆదరించాలని కోరారు.
నటుడు విప్లవ్ మాట్లాడుతూ .. ‘ఈ డాక్యుమెంటరీ చూస్తుంటే అక్కడకు వెళ్లాలని అనిపిస్తోంది. నిర్మాత ప్రేమ్ కుమార్తో నాకు చాలా పరిచయం ఉంది. కచ్చితంగా ఈ సారి వెళ్లేందుకు ప్రయత్నిస్తా అన్నారు.