Nagarjuna : హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ.…
Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ ఆలోచింపజేస్తుందని డైరెక్టర్ కరుణ కుమార్ అన్నారు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తీయగా.. తాజాగా దీన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ.. నిజమైన ఘటనలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలను…
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.. మరోరోజు ఆరో రోజు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగాయి..
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 5వరకు వేడుకలు కొనసాగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు పరిమిత భక్తుల మధ్య వేడుకలు జరిగాయి. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో లేనందున పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు కనీసం 14 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ఇంద్రకీలాద్రి కొండ…
కరోనా పోవాలి.. మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి.. అన్ని పండులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు.. అయితే, కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపిన ఆమె.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని..…