Priyanka: ప్రస్తుతం నటీమణులు అందరు పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లే కాదు సీరియల్ హీరోయిన్స్ సైతం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించిన ప్రియాంక నల్కారి రహస్యంగా పెళ్లి చేసుకుంది. తెలుగులో పలు సినిమాల్లో హీరోకు చెల్లెలిగా నటించి మెప్పించిన ప్రియాంక.. తమిళ్ లో సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది.తమిళ్ లో రోజా సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. గత కొంతకాలంగా ఆమె వ్యాపారవేత్త, నటుడు అయినా రాహుల్ వర్మతో ప్రేమాయణం నడుపుతుంది. ఇక ఈ జనతా తాజాగా మలేషియాలో పెళ్లితో ఒకట్టయ్యినట్లు తెలుస్తోంది.
Agent Second Single: ఆమెను అలా చూస్తుంటే అయ్యగారి వలన అయితలేదంట
రాహుల్, ప్రియాంక మెడలో తాళికడుతున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఎవరికి తెలియకుండా ఈ జంట మలేషియాలో పెళ్లి చేసుకోవడం ఏంటి అనేది అంతుచిక్కడం లేదు. వారి పక్కన కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ లేకపోవడం గమనార్హం. దీంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఈ జంట మలేషియా వెళ్లి పెళ్లి చేసుకున్నారా..? లేక ఇదేమైనా సీరియల్ షూటింగా అనేది తెలియాల్సి ఉంది. ఫోటోలను బట్టి చుస్తే నిజం పెళ్లిలానే కనిపిస్తుంది. పింక్ కలర్ చీర, మెడలో పసుపు తాడు.. నుదుటిన దేవుడి కుంకుమతో ప్రియాంక కనిపించగా.. తెల్లటి పంచె, షర్ట్ తో రాహుల్ కనిపించాడు. ఇక వీరి పెళ్లి ఫోటోలను చూసిన అభిమానులు నవదంపతులకు శుభాకాక్షంలు తెలుపుతున్నారు.