Agent First Single: అక్కినేని నట వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్.. దాదాపు రెండేళ్లు తరువాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచేసిన మేకర్స్.. ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రంలోని రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Virupaksha: మెగా హీరోకే కాదు అమ్మడు.. మాక్కూడా తెగ నచ్చేశావ్
“ఏందే.. ఏందే.. ఏట్నో అయితాందే” అంటూ సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. ఇక ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ అందించాడు. ఇక సోషల్ మీడియా సెన్సేషన్ సంజిత్ హెగ్డే, పద్మలత ఈ సాంగ్ ను ఆలపించి ఒక రేంజ్ కు తీసుకెళ్లారు. అచ్చంగా తెలంగాణ యాసలో ఈ సాంగ్ ఉండడం విశేషం. ఇక విజువల్స్ అయితే అద్భుతమని చెప్పాలి. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లలో ఈ సాంగ్ ను షూట్ చేయడంతో రిచ్ లుక్ వచ్చేసింది. ఇక అఖిల్- సాక్షి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మొదటిసారి ప్రేమలో పడిన హీరో.. తన ప్రేయసికి తనలోని ప్రేమ భావాలను తెలుపుతున్నట్లు లిరిక్స్ వింటుంటే అర్ధమవుతోంది. అఖిల్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టగా.. సాక్షి సైతం అందాలను ఆరబోసి మెప్పించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అయ్యగారు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.