సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈసారి గ్లామర్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ప్రియమణి ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది. అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి మాట్లాడింది. వారు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎలా సక్సెస్ సాధిస్తున్నారో వివరించింది.
Read Also : హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… సామ్, నయన్ పై ప్రియమణి కామెంట్స్
ఇక ఇటీవల సంచలనం లేపిన సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ పై స్పందిస్తూ “ఈ సాంగ్ లో సమంత హాట్ హాట్‌గా కనిపించిందని నాకే కాదు నా భర్తకు కూడా అనిపించింది. బహుశా సామ్ కెరీర్లో ఇలాంటివి చేసి ఉండకపోవచ్చు. ఈ పాటను చాలా మంది డౌన్లోడ్ చేసి, ఇప్పటికే రీల్స్‌ను తయారు చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇది నంబర్ వన్ పాటగా నిలిచింది. ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు దేవి శ్రీ ప్రసాద్‌కి హ్యాట్సాఫ్. కొరియోగ్రఫీ చాలా అందంగా ఉంది” అంటూ సామ్ పై ప్రశంసల వర్షం కురిపించింది ప్రియమణి. ఇక హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం కూడా మారిందని, ఇప్పుడు హీరోయిన్లు చేసే అన్ని రకాల పాత్రలను పేక్షకులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది ఈ భామ.