Praveen IPS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్.. ‘ప్రవీణ్ ఐపీఎస్’ గ్లింప్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praveen IPS Glimpse: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా మాజీ ఐపీఎస్ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపీఎస్” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిభొట్ల విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేయగా ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ఐపిఎస్ సినిమా యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు రమణ తేజ వంటి వారు పాల్గొన్నారు.
Alekhya Harika: నక్క తోక తొక్కిన అలేఖ్య హారిక!
Also Read
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
ఈ క్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రవీణ్ ఐపీఎస్ సినిమా ఒక మంచి కథ కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారని, అదే విధంగా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా సక్సెస్ సాధించి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక నవంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నంద కిషోర్, రోజాలతో పాటు దుర్గా దేవ్ నాయుడు, వన్య అగర్వాల్, సతీష్ సరిపల్లి, జ్యోతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో కొంత పొలిటికల్ మైలేజ్ కూడా లభిస్తుందని ప్రవీణ్ కుమార్ అభిమానులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!