Prashanth Varma: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం హనుమాన్. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా హనుమాన్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడంతో మరింత హైప్ పెరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి.. ప్రశాంత్ వర్మ పేరును మర్చిపోయి పలకడంపై ట్రోల్స్ కూడా వచ్చాయి. చిరంజీవి కొన్ని ఈవెంట్స్ లో పేర్లను తప్పుగా పలకడం, వేరే పేరు చెప్పడం చూస్తూనే ఉంటాం. అలాగే ఒక ఈవెంట్ లో రష్మిక మందన్న పేరును రష్మిక ముండక్క అని పలకడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. హనుమాన్ ఈవెంట్ కు రావడానికి నాకు నాలుగు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. టాలెంటెడ్ డైరెక్టర్ సురేష్ వర్మ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ షాట్ వరకు కట్ చేసి.. అక్కడ ఉన్నది సురేష్ వర్మ కాదని, ప్రశాంత్ వర్మ అని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. చిరు ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటారని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ట్రోలింగ్ కు చెక్ పెట్టాడు ప్రశాంత్ వర్మ… ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ” పేరులో ఏముంది.. పిలిచిన వ్యక్తి పలుకులో ప్రేమ ఉన్నప్పుడు” అంటూ చిరును ట్యాగ్ చేశాడు. ఏదిఏమైనా జరిగిన ఒక చిన్న మిస్టేక్ ను ఇలా ప్రేమగా చెక్ పెట్టిన విధానం ఆకట్టుకుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి హనుమాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
పేరులో ఏముంది.. పిలిచిన వ్యక్తి పలుకులో ప్రేమ ఉన్నప్పుడు!@KChiruTweets sir ❤️
— Prasanth Varma (@PrasanthVarma) January 11, 2024