Pranitha Subhash: పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత ఆ తరువాత వరుస అవకాశాలను అయితే అందుకున్నది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన నటించి మెప్పించిన ఆమె.. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. వివాహం తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్న ఆమె కొన్ని రోజుల క్రితం తాను గర్భవతిని అని తీపి కబురు చెప్పింది. అప్పటినుంచి నిత్యం బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అభిమానులకు చెప్పుకొచ్చింది.
“పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అని పాపతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
The last few days have been surreal. Ever since our baby girl arrived.. 🧿❤️ pic.twitter.com/kKWsTU8gqW
— Pranitha Subhash (@pranitasubhash) June 10, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..