సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ఒక మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు మహేష్ అండ్ త్రివిక్రమ్. ఈ కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్, ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో లీకులు ఇచ్చేస్తున్నారు. గతంలో మహేష్ బాబు లుక్, మహేష్ బీడీ తాగుతున్న లీక్, లొకేషన్ లీక్… ఇలా గుంటూరు కారం షూటింగ్ స్పాట్ నుంచి ఎప్పుడు షూటింగ్ జరిగినా ఎదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఈ లిస్టులో ప్రకాష్ రాజ్ పాత్రకి సంబంధించిన లీక్ కూడా వచ్చి చేరింది. గుంటూరు కారం సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.
లేటెస్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబు లేని సీన్స్ ని, ఇతర కాస్టింగ్ సీన్స్ ని త్రివిక్రమ్ షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్ నుంచి… “ప్రజాబంధు… జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు శ్రీ. వైర వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు… నిజామాబాద్” అని ఉన్న ఒక ఫ్లెకీని ఫాన్స్ లీక్ చేసారు. ప్రకాష్ రాజ్ ఉన్న ఈ ఫోటోలు లీక్ అవ్వడంతో గుంటూరు కారం, గుంటూరు నుంచి నిజామాబాద్ వరకూ స్ప్రెడ్ అయి ఉంటుంది అనే విషయం తెలిసిపోయింది. అంటే మహేష్ బాబు అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో కూడా విలన్స్ ని వాయించడం గ్యారెంటీ. అయితే ఇది ఆన్ స్క్రీన్ డైరెక్ట్ గా చూస్తే థ్రిల్ ఉంటుంది కానీ ఇలా ముందే లీక్ చేస్తే థియేటర్స్ లో సడన్ గా మహేష్ బాబు అండ్ ప్రకాష్ రాజ్ మధ్య సూపర్బ్ సీన్ ఓపెన్ అయినా, పెద్ద కిక్ ఉండకపోవచ్చు. ఈ విషయం తెలుసుకొని ఫాన్స్ అండ్ లీక్స్ అవుతూనే ఉన్నాయి కాబట్టి చిత్ర యూనిట్ కూడా జాగ్రత్తగా ఉంటే ఇకపై అయినా లీక్స్ బయటకి రాకుండా ఉంటాయి.