Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్త, అమ్మ పాత్రలతో బిజీగా ఉన్న ఇటుపక్క బుల్లితెర షోలలో కూడా మెరుస్తోంది. ఇక సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ప్రగతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టింది. చిన్నతనం నుంచి ఆమె పడిన కష్టాలు, ఆమె చేసిన తప్పులు గురించి ఏకరువు పెట్టింది. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే అమ్మతో పాటే తన జీవితం సాగిందని, తెలిసి తెలియని వయస్సులో హీరోయిన్ ఛాన్సులు వాగులోకి తప్పు చేసినట్లు చెప్పుకొచ్చింది. 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని మరో తప్పు చేశానని. బాబు పుట్టాకా తాను చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నానని తెలిపింది.
ఇక 24 ఏళ్లకే తల్లి పాత్రలు చేయడానికి సిద్దమయ్యాను అని, తనకన్నా వయస్సులో పెద్దగా ఉన్నవారికి తల్లిగా చేసి మెప్పించినట్లు చెప్పుకొచ్చింది. ఇక కొందరు తనను ఆంటీ అని పిలవడం నచ్చదని, ఆంటీ ప్లేస్ లో అమ్మ అని పిలిస్తే పలుకుతానని తెలిపింది. ” ఆంటీ అనే పదం తప్పుగా అనిపిస్తోంది. కొంతమంది ఒక శాడిస్టిక్ గా ఆంటీ అని పిలుస్తూ ఉంటారు.. ఏదో రకంగా ఆంటీ అని పిలిచేవారు నాకు నచ్చదు. చిన్నపిల్లలు, నా కొడుకు ఏజ్ వాళ్ళు నన్ను ఆంటీ అని పిలిస్తే తప్పులేదు.. కానీ ఒక రకంగా చూస్తూ ఎగతాళి గా ఆంటీ అని పిలిస్తే ఊరుకోను” అని చెప్పుకొచ్చింది.