టాలీవుడ్ టాలెంటెడ్ నటి ప్రగతి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహాయనటిగా ప్రగతి ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత ఫేమస్ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 చిత్రంలో ప్రగతి కీలక పాత్రలో నటించిన విషయం విదితమే . ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ప్రగతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆమె కెరీర్ లో తాను పడిన కష్టాలను చెప్పుకొచ్చింది.
“కెరీర్ మొదటి నుంచి ఎన్నో కష్టాలు పడి మంచి పాత్రలను ఎంచుకుంటూ వచ్చాను.. అవి అన్నీ నాకు మంచి గుర్తింపుని ఇచ్చాయి. అయితే కొన్నిసార్లు నేను కూడా స్తే ప్రాపర్టీగా మారిపోయాను. అందమైన హీరోయిన్ కు అమ్మగా, విలన్ కు భార్యగా ఒక మూలా నిలబడేదాన్ని.. ఆ పాత్రలు చేసి చేసి విసుగొచ్చేసింది. అందుకే మధ్యలో సినిమాలకు బ్రేక్ చెప్పాను. ఆ సమయంలోనే ఎఫ్3 లో అవకాశం వచ్చింది. ఈ పాత్ర నాకు చాలా బాగా నచ్చడంతో పాటు నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇలాంటి పాత్రలు కోసమే ఒక నటి ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటుంది.. ఎఫ్3 లో నా పాత్ర నాకు నటిగా సంతృప్తి ఇచ్చింది. థాంక్స్ అనిల్ రావిపూడి గారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.