Narsimha Nandi: “ప్రభుత్వ సారాయి దుకాణం” పేరుతో సినిమా మొదలెట్టిన నేషనల్ అవార్డ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhutva Sarai Dukanam Movie of Narsimha Nandi started today: 1940లో ఒక గ్రామం పేరుతో సినిమా తెరకెక్కించి బెస్ట్ నేషనల్ అవార్డు అందుకుని ఆ తర్వాత కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఆలోచింప చేసే సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ బ్యానర్ మీద మరో సినిమా మొదలు పెట్టారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. షేక్ స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగిందని నరసింహ నంది పేర్కొన్నారు.
Charan Raj: పాము లాంటి క్యారెక్టర్ చేశా.. ఇలాంటివయితే ఫ్రీగా నటిస్తా : చరణ్ రాజ్
Also Read
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
- KorianKanakaRaju : భారీ ధర పలికిన 'కొరియన్ కనకరాజ్' ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
- Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
- Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగిందని, పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అదితి మైకల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి వి నాగిరెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా సుక్కు సంగీతం అందిస్తున్నారు. మహి రెడ్డి పండుగల కెమెరామెన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి నరసింహ నంది దర్శకత్వం వహిస్తూనే కథ కూడా అందించడం గమనార్హం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శివాజీ హీరోగా ఒక సినిమాను నరసింహ నంది కొన్నేళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఎందుకో కానీ ఆ సినిమా తెరకెక్క లేదు.
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!