Charan Raj: పాము లాంటి క్యారెక్టర్ చేశా.. ఇలాంటివయితే ఫ్రీగా నటిస్తా : చరణ్ రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charan Raj Exclusive Interview for Narakasura Movie: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా రకాసుర సినిమాలో కీలక పాత్రలో నటించిన చరణ్ రాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాకి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోండగా సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు.
@”నరకాసుర” సినిమాలో నేను ఒక పాము లాంటి స్వభావమున్న క్యారెక్టర్ చేశా, అంటే మంచి వాళ్లతో మంచిగా ఉంటాడు, చెడ్డ వాళ్లతో చెడుగా ఉంటాడు. నా కెరీర్ లో నేను చేసిన ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది, నాతో పాటు మా అబ్బాయి కూడా ఈ సినిమాలో నటించాడు, అతనికి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ సెబాస్టియన్.
Also Read
@ “నరకాసుర” సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెబాస్టియన్ కమిట్ మెంట్, డెడికేషన్ బాగా నచ్చాయి. ఉదయం షూటింగ్ మొదలైతే రాత్రి వరకు అదే ఉత్సాహంతో వర్క్ చేసేవాడు,, సెట్ బాయ్ పని కూడా అవసరమైతే తనే చేసేవాడు. నేను డైరెక్టర్ అనే అహం సెబాస్టియన్ ఎప్పుడూ కనిపించలేదు, సినిమా పట్ల ప్యాషన్ తో ఉంటాడు. అందుకే ప్రమాదం జరిగి చేయి కోల్పోయినా అంతే పట్టుదలగా వర్క్ చేశాడు.
@ “నరకాసుర” సినిమాలో హీరో రక్షిత్ చాలా బాగా నటించారు, అతనికి ఈ సినిమాతో మంచి యాక్షన్ హీరోగా పేరు వస్తుంది. మంచి ఫ్యూచర్ ఉన్న హీరో రక్షిత్, అతనికి సినిమా అంటే ఎంతో ఇష్టం.
@ గతంలో నేను, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కోట ఇలా చాలా లిమిటెడ్ విలన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, ఇప్పుడు హీరో, విలన్ అనేది లేదు. సంజయ్ దత్, జగపతి బాబు, అర్జున్ లాంటి వాళ్లంతా విలన్స్ గా నటిస్తున్నారు. మంచి క్యారెక్టర్ చేయాలి, ప్రేక్షకుల అభిమానం పొందాలి అనేది ఒక్కటే ఇవాళ ప్రతి నటుడికి ఉన్న లక్ష్యంగా మారింది.
@ నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నా, మంచి క్యారెక్టర్ ఉంటే డబ్బు ఇవ్వకున్నా నటిస్తా అందుకే ఆ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా మళ్లీ గతంలో జెంటిల్ మేన్ తరహా పోలీస్ క్యారెక్టర్స్ ఇస్తామంటే వద్దని చెప్పా దీంతో నాకు తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది.
@ తెలుగు సినిమా ఇండస్ట్రీ ది బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంటే బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు సినిమా త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. హీరోలకు వంద, నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. గతంలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, టి కృష్ణ గారు వంటి దర్శకులు వేసిన బాటలో టాలీవుడ్ యంగ్ జెనరేషన్ పయనిస్తోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!