కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్… లియో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 19న రానున్న సినిమాతో లోకేష్ మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. లియో ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో లోకీ ఖాతాలో మరో హిట్ పడేలానే ఉంది. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ… లోకేష్, ప్రభాస్ తో సినిమా ఉందని రివీల్ చేసాడు. తలైవర్ 170, ఖైదీ 2, విక్రమ్ 3, రోలెక్స్ సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందట. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎండ్ కార్డ్ వేసేలా… ఎవెంజర్స్ కి ఎండ్ గేమ్ సినిమాలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ మూవీ అలా అవుతుందట. LCUకే కాదు లోకేష్ కెరీర్ కి కూడా ప్రభాస్ సినిమాతో ఫుల్ స్టాప్ పడనుందట. ప్రభాస్ చేసే సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ ఆపేస్తాడట. సో లాస్ట్ సినిమా అంటే లోకేష్ ఇంపాక్ట్ ఏ రేంజులో ఉంటుందో ఊహించొచ్చు.
ఇక ప్రభాస్ తో ప్రాజెక్ట్ విషయాన్ని స్వయంగా లోకేష్… ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నాని చెప్పడం, సిని అభిమానులని ఎగ్జైట్ చేస్తోంది. గతంలో ప్రభాస్‌కు లోకేష్ స్టోరీ నరేట్ చేశాడని మాత్రమే వార్తలొచ్చాయి కానీ గత మూడు, నాలుగేళ్లుగా తాను ప్రభాస్‌తో టచ్‌లో ఉన్నానని లోకేష్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ కాంబినేషన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏదేమైనా.. ఇది పవర్ హౌజ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు.