యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చ్ 11న విడుదల కానున్న “రాధే శ్యామ్” కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో మన పాన్ ఇండియా స్టార్ తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటానని, రాబోయే రోజుల్లో తన సోషల్ మీడియా యాక్టివిటీని ఇంకా తగ్గించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అయితే ఇది ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా టచ్ లో ఉంటున్నాడు ప్రభాస్ అభిమానులు బాధపడుతున్నారు.
Read Also : 30 Weds 21 Season 2; Episode 4: ఇట్స్ మహేందర్స్ షో!
కానీ సినిమాల రూపంలో అభిమానులకు మరింత చేరువవుతానని అభిమానులకు మాట ఇచ్చాడు. ప్రతి సంవత్సరం 2-3 సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నానని ప్రభాస్ పేర్కొన్నాడు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తక్కువగా స్పందించినప్పటికీ తనను ఇంతగా ప్రేమిస్తున్నందుకు తన అభిమానులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపాడు.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన బహుభాషా చిత్రం “రాధేశ్యామ్”ని యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించింది. ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాని మార్చి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.