Prabhas Salman: ఇద్దరూ ఒకే డేట్ కి వస్తే… రెండు టిప్పర్ లారీలు గుద్దుకున్నట్లు ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీకి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. బుజ్జిగాడు సినిమాలో “టిప్పర్ లారీ వెళ్లి స్కూటీని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే” అనే డైలాగ్ ని పూరి సూపర్ రాసాడు, ప్రభాస్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ కాస్త మార్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన సలార్ వాయిదా పడింది. సెప్టెంబర్ 28 డేట్ ని మిస్ అయిన సలార్, లేటెస్ట్ న్యూస్ ప్రకారం సలార్ సినిమా నవంబర్ 9/10న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీపావళి ఫెస్టివల్ టార్గెట్ చేస్తూ సలార్ సినిమా రిలీజ్ అవనుందని డిస్ట్రిబ్యూటర్స్ కి అందిన సమాచారం. దీపావళి సీజన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ కి సాలిడ్ కాంపిటీషన్ ఎదురయ్యింది.
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘టైగర్ 3’ మూవీ నవంబర్ 10న రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ టైగర్ సీరీస్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు… ఈసారి టైగర్ 3 సినిమాతో సల్మాన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. టైగర్ క్యారెక్టర్ కి ఉన్న బ్రాండ్ వాల్యూ సౌత్ మార్కెట్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సో అటు సల్మాన్ ఖాన్, ఇటు ప్రభాస్ లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకే డేట్ కి సూపర్ స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ దొరుకుతాయా? కలెక్షన్స్ డివైడ్ అవుతాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్కలని కాసేపు పక్కన పెడితే… టిప్పర్ లారీ వెళ్లి స్కూటీని గుద్దడం కాదు ప్రభాస్-సల్మాన్ వార్ కి దిగితే రెండు టిప్పర్ లారీలే కొట్టుకున్నట్లు ఉంటుంది. రెండు సినిమాలు కలిపి ఈజీగా 2500 కోట్లు కలెక్ట్ చేయగలవు. సో నవంబర్ నెలలో సలార్ రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అయితే టైగర్ vs డైనోసర్ వార్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ ఆన్ అయినట్లే.
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!