పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని, రెండు పార్ట్స్ గా సినిమా తెరకెక్కుతుందని… ఇలా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ సలార్ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సలార్ సీక్వెల్ పై సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, ఈ సినిమాలో నటిస్తున్న కన్నడ యాక్టర్ దేవరాజు. ఇటివలే ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో యాక్టర్ దేవరాజు మాట్లాడుతూ… “నేను సలార్ మూవీలో నటిస్తున్నాను, అయితే ఫస్ట్ పార్ట్‌లో చాలా తక్కువ సీన్స్ ఉంటాయి సెకండ్ పార్ట్‌లో ఎక్కువ సీన్స్ ఉంటా”యని చెప్పుకొచ్చారు. దీంతో సలార్ 2 పార్ట్స్‌గా తెరకెక్కుతోందనే క్లారిటీ అఫీషియల్ గా వచ్చేసినట్టే.
ఇక ఈ సినిమా షూటింగ్ ని మే నెలలో షూటింగ్ కంప్లీట్ చేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒకేసారి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారా? లేదంటే పార్ట్ వన్ కంప్లీట్ అయ్యాక పార్ట్ 2 చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఎలా షూట్ చేసినా సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండడంతో బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాడు. కెజియఫ్‌తో ప్రశాంత్ నీల్ ఎన్నో రికార్స్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ సీక్వెల్ సెంటిమెంట్ పీక్ స్టేజ్ లో ఉంది. అందుకే సలార్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి రావడం పక్కా అని చెప్పొచ్చు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నంబర్స్ ని కలెక్ట్ చేస్తుందో చూడాలి.