ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ఇంకొన్ని రోజులు లేక రెండు మూడు నెలలు ఓపిక పట్టలేమా? అనే మైండ్‌సెట్‌తోనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇంకొన్ని నెలలు సలార్‌ను మరిచిపోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిన సలార్… నవంబర్, డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవడం పక్కా అనుకున్నారు. లేటెస్ట్ ఇన్వర్మేషన్ ప్రకారం ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. సలార్ ఏకంగా సమ్మర్‌కు షిప్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందట. మధ్యలో ప్యాచ్ వర్క్ కోసం రీ షూట్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా సెకండ్ పార్ట్ కూడా ఉంది కాబట్టి.. ఈ సినిమా థియేటర్లోకి రావడానికి చాలా సమయం పట్టనుందని అంటున్నారు.
ఒకవేళ 2024 సమ్మర్‌లో రావడానికి సలార్ ఫిక్స్ అయితే… మరో ఆరెడు నెలలు ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు. అయితే ఇలాంటి పుకార్లపై క్లారిటీ రావాలంటే.. అక్టోబర్ 23 వరకు ఆగాల్సి ఉంది. ఆ రోజు ప్రభాస్ బర్త్ డే ఉంది. దానికి సరిగ్గా 30 రోజులు ఉంది. ఖచ్చితంగా ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా సలార్ నుంచి సాలిడ్ అప్డేట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అక్టోబర్ 23 వరకు సలార్ నుంచి ఎలాంటి లీకులు, అప్డేట్స్ బయటికొచ్చే ఛాన్స్ లేదు. ఇక సమ్మర్‌లో సలార్ రిలీజ్ చేయాలనుకుంటే.. సాలిడ్ డేట్‌ను లాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే… సలార్ పై ఉన్న హైప్‌కు బిజినెస్‌కు మంచి హాలీడేస్ కలిసి రావాలి. ఇప్పటికే సమ్మర్ రేసులో చాలా సినిమాలున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా సమ్మర్ ని టార్గెట్ చేసేలా ఉంది. మరి ఇన్ని పెద్ద సినిమాలు ఒకటే సీజన్ లో రిలీజ్ అయితే ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? థియేటర్స్ సంగతి ఏంటి అనేది చూడాలి.