సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో వింటేజ్ మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై ప్రభాస్ రివ్యూ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. డార్లింగ్ నిన్న రాత్రి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకొని మరీ సర్కారువారి పాట సినిమా చూసారని ప్రభాస్ సన్నిహితులు తెలుపుతున్నారు.
ఇక సినిమా చాలా బావుందని, మహేష్ నటన తనకు నచ్చిందని ప్రభాస్ అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ మరియు ఫైట్స్ కూడా నచ్చాయని.. వాటిని బాగా ఎంజాయ్ చేసినట్లు డార్లింగ్ చెప్పాడట.. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఈ స్టార్ హీరోల మ్యూచువల్స్ మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే మహేష్, ప్రభాస్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం ఆందరికి తెలిసిందే. ప్రభాస్ నటించిన ‘వర్షం’ ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్టుగా హాజరైన మహేష్.. ఆ తరువాత చాలా కాలం తరువాత ఏపీ సీఎం జగన్ మీటింగ్ లో మళ్లీ కనిపించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.