ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సలార్… బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. థియేటర్లో కంటే ఓటిటిలో సలార్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో అర్థం కాని వారు ఓటిటిలో ఒకటికి రెండు సార్లు సలార్ సినిమా చూస్తున్నారు. అలాగే ఓటిటిలో హిందీ భాషలో స్ట్రీమింగ్‌కు రాకుండానే గ్లోబల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో సత్తా చాటుతోంది సలార్. దీంతో సలార్ పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అసలు కథ మొత్తం శౌర్యాంగ పర్వంలో ఉంటుందని సలార్ సీజ్ ఫైర్ క్లైమాక్స్‌లో లీడ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ మధ్య హోంబలే ఫిలింస్ అదినేత విజయ్ కిరగందూర్ త్వరలోనే సలార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్తామని, వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ శౌర్యాంగ్ పర్వానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ ‘దేవర’, వార్ 2 కంప్లీట్ అయ్యేలోపు సలార్ సెకండ్ పార్ట్‌ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… నవంబర్ నుంచి సలార్2 షూటింగ్ స్టార్ట్ చేసి… 2025 దసరాకి సినిమాని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ పార్ట్ వన్‌తో పాటు సలార్ 2 షూటింగ్ కూడా కొంతభాగం కంప్లీట్ చేశాడు కాబట్టి… వచ్చే ఏడాదిలో శౌర్యాంగ పర్వం థియేటర్లోకి రావడం పక్కా అని చెప్పొచ్చు. అయితే… సలార్ 2 ఎండింగ్ స్టేజీలో ఎన్టీఆర్ 31 మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. సో త్వరలోనే సలార్ 2తో పాటు ఎన్టీఆర్ 31 గురించి అప్డేట్ ఇవ్వనున్నాడు ప్రశాంత్ నీల్. మరి శౌర్యాంగ పర్వం ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: Suhaas: చిన్న సినిమాకి ఈరోజు హిట్ టాక్ పడుతుందా?