‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ గ్యాప్ లో మరో సినిమాని మొదలుపెట్టాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిన ఆ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వగానే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు. మారుతీతో సినిమా వద్దంటూ రచ్చ చేశారు. ఇలాంటి సమయంలో పూజా కార్యక్రమాలు చేసి, భారి…