Prabhas: ప్రభాస్.. బాహుబలికి ముందు .. బాహుబలి తరువాత అని చెప్పొచ్చు. అది నటన మాత్రమే కాదు లుక్ పరంగా కూడా బాహుబలి తరువాత ప్రభాస్ లుక్ టోటల్ గా మారిపోయింది. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన కావొచ్చు.. వేరే సమస్యల వలన కావచ్చు. కారణాలు ఏవైనా ప్రభాస్ లుక్ మాత్రం అంతకు ముందులా లేదు అన్నది వాస్తవం. ప్రభాస్ లుక్ పై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు ఆదిపురుష్ సమయంలో రాముడిగా ప్రభాస్ లుక్ పై ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాహో, రాధేశ్యామ్ సినిమాలో ఎంత ఎడిట్ చేస్తే.. ప్రభాస్ ఆ రేంజ్ లో కనిపించాడా అందరికి తెలుస. ఇక సలార్ లో కూడా అదే రిపీట్ అవుతుంది అనుకున్నారు అభిమానులు. కానీ, సలార్ లో ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకొని డార్లింగ్ .. ఊర మాస్ కటౌట్ ను చూపించి అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చాడు.
Salaar: ఆ సినిమాను అచ్చుగుద్దినట్లు దింపేశారే.. ?
ఆరడుగుల బాడీ.. అలా నడుస్తూ వస్తుంటే.. గూస్ బంప్స్ రాకుండా మానదు. ఇక చివరి షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ బీభత్సం. వెనుక కత్తులు పట్టుకున్న చేతులు.. రక్తంతో తడిసిన శరీరం.. చూడడానికి కాళీమాత మగవాడి రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా కనిపించాడు. ట్రైలర్ లో ప్రభాస్ కనిపించింది తక్కువ షాట్స్ మాత్రమే అయినా కూడా ఆ లుక్ తో మెస్మరైజ్ చేశాడు. ఇక ఇప్పుడు వస్తున్నా ఏఐ ఇమేజెస్ లో డార్లింగ్ ఎలా ఉన్నాడో.. సలార్ లో కూడా ప్రభాస్ ఇంచుమించు అలాగే కనిపించాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.