Prabhas vs Raviteja : తెలుగు సినిమాలకు సంక్రాంతి అంటే పెద్ద సీజన్. అప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. అందుకే ఆ సీజన్ లో ఎక్కువ సినిమాలు వచ్చినా పెద్ద నష్టాలు ఉండవు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోలు కర్చీఫ్ వేశారు. చిరంజీవి హీరోగా వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న 76వ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే ఉండనుంది. ఇప్పుడు సడెన్ గా ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. అఫీషియల్ గా డేట్ కూడా ప్రకటించారు. చిరంజీవి-అనిల్ కాంబోలో వస్తున్న మూవీని అస్సలు వాయిదా వేయరు.
Read Also : Prabhas vs Chiranjeevi : చిరంజీవికి ప్రభాస్ పోటీ.. ఇక రణరంగమే..
చిరు, ప్రభాస్ సినిమాలపైనే భారీ బజ్ ఉంది. కానీ రవితేజ సినిమాకు అంత క్రేజ్ రావట్లేదు. దాని రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రభాస్, చిరు మూవీల మధ్య భీకర పోటీ తప్పేలా లేదు. ఇంతటి పోటీలో ఉండటం ఎందుకు అని రవితేజ మూవీ టీమ్ ఆలోచిస్తోందంట. ప్రభాస్ రాకతో సంక్రాంతి లెక్కలు మారిపోతున్నాయి. పైగా అటు మెగాస్టార్ మూవీ ఉంది. రవితేజ సినిమాకు ఇంకా షూటింగ్ స్పీడ్ గా జరగట్లేదు. కాబట్టి సంక్రాంతికి మాస్ మహారాజ మూవీ రాకపోవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభాస్ సినిమా రాకపోయి ఉంటే.. కచ్చితంగా రవితేజ సినిమా వచ్చేదేమో. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సంక్రాంతి పెద్ద సీజన్ కాబట్టి రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Read Also : Manchu Manoj : స్టార్ హీరోయిన్ కు మనోజ్ క్షమాపణలు.. ఎందుకంటే..?