Prabhas In Balayya Unstoppable Show: ఒకరేమో తెలుగునాట ‘గాడ్ ఆఫ్ మాసెస్’ గా సాగుతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ. మరొకరేమో ‘ఇంటర్నేషనల్ స్టార్’గా జేజేలు అందుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరూ ఒకే వేదికపై కొన్ని గంటలపాటు సందడి చేస్తారంటే ఆసక్తి కలగని వారుంటారా!? ‘ఆహా’లో బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసిన దగ్గర నుంచీ ఆ ఎపిసోడ్ పై సినీ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. బాలయ్య హోస్ట్ గా, ప్రభాస్ గెస్ట్ గా సాగిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానుంది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ రెండు సార్లు, టీజర్ మరోమారు జనాన్ని కట్టిపడేశాయి. ఈ సమయంలోనే అభిమానులకు మరో తీయటి కబురు అందింది. అదేంటంటే – ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం కానుందట! ఇప్పటి దాకా ‘అన్ స్టాపబుల్’ షోలో ఏ గెస్ట్ కూ దక్కని విధంగా ప్రభాస్ కు ఈ గౌరవం దక్కిందని చెప్పవచ్చు.
Chiranjeevi: అలా చేయలేని రోజు రిటైర్ అవుతా.. ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను
ప్రభాస్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సైతం ఆరంభంలో ఒక చిత్రంగానే మొదలయింది. అందులోని కథ, కథనం నిడివి పెరగడంతో తరువాత రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పుడు బాలయ్య టాక్ షోలో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లోనూ ఏది ట్రిమ్ చేయనంత ఆసక్తికరంగా ఉంటుందట! అందువల్ల ఏ మాత్రం ఎడిట్ చేయకుండా ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు. “కంటెంట్ ఎంత బాగుందంటే ఎడిట్ చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు” అని ఆహా బృందం అంటోంది. “మాహిష్మతి ఊపిరి పీల్చుకో… హీ ఈజ్ ఆన్ ద వే…” అంటూ సందడి మొదలు పెట్టారు. మరి డిసెంబర్ 30న ప్రసారం కానున్న ప్రభాస్ తొలి ఎపిసోడ్ లో ఎన్ని ముచ్చట్లు ఉంటాయో? ఆ తరువాత రాబోయే ఎపిసోడ్ లో మరెన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయో? చూడాలని ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి’ మొదటి భాగం ముగింపులో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ఆసక్తికరమైన ప్రశ్నను జనంలోకి వదిలారు. ఆ ప్రశ్నతోనే రెండో భాగానికి మరింత క్రేజ్ పెరిగింది. అదే తీరున 30న ప్రసారమయ్యే ఎపిసోడ్ 1లోని ఎండింగ్ లో ఏ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంటుందో చూడాలని బాలయ్య, ప్రభాస్ ఇరువురి ఫ్యాన్స్ తో పాటు ఈ షోను ఎంతగానో ఇష్టపడుతున్నవారు కూడా ఎదురు చూస్తున్నారు.
Woman Harassed by Gang: షేర్ ట్యాక్సీలో మహిళపై సామూహిక అత్యాచారం