Prabhas: ఆస్పత్రిలో యంగ్ రెబల్‌స్టార్.. ప్రభాస్‌కు అసలు ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏకంగా నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి సినిమాకు కూడా ఇటీవల ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. వీటిలో సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ తాజాగా ఆస్పత్రిలో కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమ అభిమాన హీరోకు ఏమైందంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు.
Read Also: Ram Charan: కొత్త లుక్‌లో అదరగొడుతున్న చెర్రీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్‌లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కాగా కొన్ని రోజుల క్రితం ప్రభాస్ కాలికి గాయం అయిందని, సర్జరీ కూడా జరిగినట్లు వార్తలు షికారు చేశాయి. ప్రభాస్‌ను వైద్యులు పరీక్షించి 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరిగింది. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా వస్తాడని మేకర్స్ ప్రకటించినా రాలేదు. దీంతో నిర్మాత అశ్వనీదత్ ప్రభాస్ ఓ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ మరోసారి ఆస్పత్రిలో దర్శనం ఇవ్వడంతో అతడికి సర్జరీ జరిగిన మాట నిజమేనా అని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆసుపత్రిలో తన పెదనాన్న కృష్ణంరాజును చూసేందుకు ప్రభాస్ వెళ్లాడంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ప్రభాస్ ఎందుకు హాస్పిటల్‌కి వెళ్లాడు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది లేటెస్ట్ వీడియోనా లేదా పాత వీడియోనా అన్న విషయంపైనా క్లారిటీ రావాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/NawinMoto/status/1568417074976010240
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?