Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఫౌజీ’ రిలీజ్ విషయంలో అందరూ అనుకున్నదే జరిగింది. రిలీజ్ వాయిదా అంటూ వచ్చిన వార్తే నిజమైంది. నిర్మాత రవిశంకరే ‘పోస్ట్‌పోన్ అవుతోంది’ అని పబ్లిక్‌గా ప్రకటించారు. వాయిదా వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ డల్ కాకుండా, బూస్ట్ అప్ ఇచ్చే మాట చెప్పాడు. డిసెంబర్ 3న రావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడింది. అయితే, ‘లిటిల్ బిట్ వెనకబడింది’ అన్నారే కానీ, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్‌కి క్లారిటీ లేకపోవడంతో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత రవిశంకర్, ఫౌజీ పోస్ట్పోన్ను అఫీషియల్‌గా ప్రకటించాడు.
“ఫౌజీ… ఫౌజీ ఉందమ్మా ఫౌజీ! లిటిల్ బిట్ కొంచెం వెనక్కి వెళ్తుంది కానీ.. కానీ అది వేరే లెవెల్ సినిమా. మీరు ప్రభాస్‌ని ‘బాహుబలి’ తర్వాత అంత గొప్పగా చూడలే, ఆ రేంజ్ సినిమా అది. కాకపోతే చిన్న సారీ, కొంచెం వెనక్కి వెళ్తున్నాం. మీరు అసలు దాన్ని లైఫ్ లాంగ్ చెరిష్ (Cherish) చేస్తారు, అంత పెద్ద గొప్ప సినిమా” అని ఫౌజీ రిలీజ్ వాయిదాతో ఫ్యాన్స్ డల్ కాకుండా.. బాహుబలి లాంటి గొప్ప సినిమా అంటూ బూస్ట్ అప్ ఇచ్చాడు నిర్మాత. మధ్యలో హిట్ అయిన సలార్, కల్కిని మించిపోతుందేమో చూడాలి మరి. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు పడవలపై ప్రయాణించడంతో, ఒక్క మూవీకి కూడా డేట్స్ ఇచ్చి త్వరగా కంప్లీట్ చేయలేకపోతున్నాడు. చెప్పిన రిలీజ్ డేట్‌కు థియేటర్స్‌లోకి వచ్చిన సినిమా ఒక్కటీ కనిపించదు. డార్లింగ్ ప్రతి సినిమా ఇలా వాయిదా పడడంతో ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. థియేటర్స్‌లో బొమ్మ పడినప్పుడు చూద్దాంలే అన్న డెసిషన్‌కు వచ్చేశారు.
Also Read
- Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
- Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
- The Paradise: తెలంగాణ ఫేవరెట్ 'సర్వపిండి'.. 'ది ప్యారడైజ్' ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
- RC17 : అక్టోబర్ 20న సుకుమార్ - రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
తాజావార్తలు
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!