ప్రస్తుతం సలార్ హైప్ చూసి… ప్రమోషన్స్ చేయకపోయిన పర్లేదు అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు మేకర్స్ లేదంటే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కు మరో పది రోజుల ఉంది అనగా… ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. ఈ రెండు తప్పితే… సలార్ రిలీజ్ మంత్ డిసెంబర్‌లో మరో ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. ఈ విషయంలో అభిమానులు కాస్త అప్సెట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ మరింత డిజప్పాయింట్ చేసేలా ఉంది. సలార్ మేకర్స్ అఫిషీయల్‌గా చెప్పకపోయినప్పటికీ… సలార్ నుంచి మరో వపర్ ప్యాక్డ్ యాక్షన్ ట్రైలర్ బయటికి రానుందనే బజ్ గట్టిగా ఉంది. రిలీజ్‌కు వారం రోజుల ముందు ఈ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అన్నారు.
ఫస్ట్ ట్రైలర్‌లో యాక్షన్ డోస్ కాస్త తగ్గడంతో… సెకండ్ ట్రైలర్ దుమ్ములేపేలా ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… సలార్ యాక్షన్ ట్రైలర్ లేనట్టే అని తెలుస్తోంది. సాంగ్ రిలీజ్ చేశాం కదా… ఇక చాలు అన్నట్టుగా మేకర్స్ ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే… మరో ట్రైలర్ రిలీజ్‌కు రెడీగా లేరని సమాచారం. కానీ సినిమా పై మరింత బజ్ రావాలంటే ప్రభాస్, ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగాల్సి ఉంది. సలార్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి.. రిలీజ్‌కు వారం రోజుల ముందైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా? ట్రైలర్ రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి.