Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. సాధారణంగా హీరోల బర్త్ డేలకు వాళ్ల రాబోయే సినిమాల నుంచి అప్డేట్లు వస్తాయనే విషయం తెలిసిందే కదా. నేడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న సలార్-2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అదే ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. హోంబలే సంస్థ నుంచి కేవలం బర్త్ డే విషెస్ మాత్రమే వచ్చాయి. పైగా ఏదో నార్మల్ ఫొటోను పెట్టేసి విష్ చేసింది నిర్మాణ సంస్థ. దీంతో ప్రశాంత్ నీల్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదో బిగ్ అప్డేట్ ఇస్తావని ఆశిస్తే ఇలా చేశావేంటని అంటున్నారు. సలార్-2 అంచనాలకు మించి ఉంటుందని గతంలోనే ప్రశాంత్ నీల్ తెలిపాడు.
Read Also : Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?
దాంతో ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ లేదా కీలక అప్డేట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఇలా షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ మావ. దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ ను ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఇలా చేశావేంటి మావా అంటూ అడుగుతున్నారు. నిన్న రాత్రి ప్రభాస్ బర్త్ డే వేడుకల్లో ప్రశాత్ నీల్ కూడా ఉన్నాడు. ఇంకోవైపు కల్కి-2 నుంచి గానీ.. స్పిరిట్ సినిమాల నుంచి గానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురయ్యారు. ఇంకో విషయం ఏంటంటే నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా కనీసం విషెస్ కూడా చెప్పకపోవడం విశేషం. మరి రాత్రి లోపు అయినా వారి నుంచి అప్డేట్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.
Read Also : Renu Desai : నా మీద కాదు.. వాటిపై ఫోకస్ చేయండి.. రేణూ దేశాయ్ ఫైర్
