Renu Desai : రేణూ దేశాయ్ సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె సన్యాసం ఎందుకు తీసుకుంటుంది.. రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అని ప్రచారాలు హోరెత్తాయి. వీటిపై రేణూ ఫైర్ అయింది. ‘ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నారు. నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నా పిల్లలను సెటిల్ చేశాక 60 ఏళ్ల తర్వాత ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు పిల్లలే ముఖ్యం.
Read Also : Ravi Teja : రవితేజ సంచలన సినిమా.. చేస్తే మామూలుగా ఉండదు
వాళ్ల భవిష్యత్ కోసమే బతికి ఉన్నాను. దయచేసి నన్ను వదిలేయండి. ప్రతి దానికి నన్ను ట్రోల్ చేయొద్దు. మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. వాటిపై ఫోకస్ చేయండి. అంతే గానీ ఇలాంటి వాటిపై కాదు అంటూ కోరింది రేణూ దేశాయ్. దీంతో ఆమె కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. రేణూ దేశాయ్ త్వరలోనే ఓ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్..