KGF సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక రీజనల్ సినిమాగా కూడా కన్సిడర్ చేయని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, వాటిని ఆడియన్స్ ఆదరిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ప్రశాంత్ నీల్ మాత్రమే. తెలుగు సినిమాకి రాజమౌళి, తమిళ సినిమాకి శంకర్-మణిరత్నంలు ఎంత చేసారో కన్నడ సినిమాకి ప్రశాంత్ నీల్ అంత చేసాడు. ఈ జనరేషన్ సినిమా చూసిన టాప్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కేవలం మూడు సినిమాలతో ఇంత పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ పుట్టిన రోజుని ప్రభాస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. సలార్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది, సెప్టెంబర్ 28న ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ హిస్టరీని షేక్ చేయడానికి రిలీజ్ అవుతోంది.
ఈ షూటింగ్ స్పాట్ లో చిత్ర యూనిట్ అందరి మధ్య ప్రశాంత్ నీల్ బర్త్ డేని ప్రభాస్ సెలబ్రేట్ చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో సలార్ టాగ్, ప్రశాంత్ నీల్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఉండడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ప్రశాంత్ నీల్ కి విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రశాంత్ నీల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసారు. ఎప్పుడు బొగ్గులో ఉండే ప్రశాంత్ నీల్, ఈసారి మాత్రం కలర్ ఫుల్ లొకేషన్స్ లో కనిపించాడు. కత్తి తిప్పుతూ, ఆర్టిస్టులకి సీన్స్ అర్ధం అయ్యేలా చెప్తూ, అప్పుడప్పుడూ క్రికెట్ ఆడుతూ ప్రశాంత్ నీల్ చాలా కూల్ గా ఉన్నాడు. అంత కూల్ గా ఉంటూనే ఇండియన్ బాక్సాఫీస్ ని హీటెక్కించే సినిమాలు ఎలా చేస్తున్నాడో ప్రశాంత్ నీల్ కే తెలియాలి.
Warmest birthday wishes to the incredibly talented director #PrashanthNeel.
From the sets of @Salaarthesaga: https://t.co/ngbTEv593L#HBDPrashanthNeel #Prabhas #Salaar pic.twitter.com/XIQEiF5RkS
— Salaar (@SalaarTheSaga) June 4, 2023